అన్నమయ్య: మదనపల్లె మహిళా డిగ్రీ కళాశాలలో ఆర్జెడి కార్యాలయ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈనెల 3న పదవీ విరమణ చేయనున్న ప్రిన్సిపాల్ కృష్ణవేణమ్మ గత నాలుగు సంవత్సరాల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్థిక, పరిపాలనకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించి, పూర్తి నివేదికను ఆర్జెడికి అందజేస్తామని ఆర్జెడి కార్యాలయ సూపరిండెంట్ శివరాం తెలిపారు.