BHPL: పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే CM రేవంత్ రెడ్డి లక్ష్యమని MLA గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఇవాళ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 469 మంది లబ్ధిదారులకు రూ. 4.69 కోట్ల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం MLA గణపసముద్రం చెరువు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేశారు.