KMR: మద్నూర్ మండలంలోని క్రైస్తవులు ఈనెల 27న బిచ్కుందలో జరిగే క్రిస్మస్ పండుగ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొనాలని తహశీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బిచ్కుందలోని మున్నూరు కాపు సంఘంలో జరిగే వేడుకలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొంటారని పేర్కొన్నారు.