KNR: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని, అందుకు చెకుముకి సంబరాలు, సైన్స్ ఫెయిర్లు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ స్కూల్లో ఈ నెల 26 నుంచి 28 వరకు రాష్ట్రస్థాయి చెకుముకి సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.