AP: ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి కిమ్స్ బిడ్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కిమ్స్ యాజమాన్యం స్పందించింది. ఆదోని మెడికల్ కాలేజీకి తాము టెండర్లు వేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది. తాము ఎక్కడా టెండర్లో పాల్గొనలేదని స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన, ఆలోచన తమకు లేదని చెప్పింది.