VZM: భారత భవిష్యత్తుకు మూలస్తంభాలైన బాలలను గౌరవిస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఉద్దేశించిన ‘వీర్ బాల్ దివస్’ వేడుకలు జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.విమలారాణి ఇతర జిల్లా అధికారులు జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.