NLG: సామ్రాజ్యవాద వ్యతిరేక భూస్వామ్య పెట్టుబడిదారు వర్గాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర సీపీఐదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహరెడ్డి అన్నారు. సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం దేవరకొండ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాని ఎగురవేశారు. జనవరి 18న ఖమ్మంలో సీపీఐ పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.