ATP: రాయదుర్గం పట్టణంలోని 17వ వార్డు దుగ్గిలమ్మ గుడి సమీపంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు భూమి పూజ నిర్వహించారు. రోడ్డు నిర్మాణం పూర్తైతే గుడికి వచ్చే భక్తులకు, పరిసర ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభంగా మారుతాయని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.