ఢిల్లీలో వీర్ బాల్ దివస్ ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పురస్కారాన్ని ఇద్దరు అందుకున్నారు. ఏపీకి చెందిన పారా అథ్లెట్ శివాని, తెలంగాణకు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయ స్వీకరించారు.