AP: అమరావతి మందడంలో రహదారి ఎలైన్మెంట్పై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం మధ్యలో రైతు రాములు(70) అనారోగ్యంలో కుప్పకూలాడు. దీంతో మంత్రి తన కాన్వాయ్‌లోనే హుటాహుటిన రైతును ఆస్పత్రికి తరలించారు. సమావేశం రద్దు చేసి స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.