NLR: సంగం మండలం రాంపు సమీపంలో జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రెండు చికెన్ వ్యర్ధాల వాహనాలు అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వాహనాల్లో ఉన్న 31 డ్రమ్ముల చికెన్ వ్యర్ధాలను పంచనామా చేశారు. ఎస్సై రాజేష్ వాహనాలను సీజ్ చేసి,కేసు నమోదు చేశారు. అక్రమంగా చికెన్ వ్యర్ధాలు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ హెచ్చరించారు.