SDPT: గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిందని, దీంతో మాజీ సీఎం కేసీఆర్‌కు గుబులు మొదలైందని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. రెండేళ్లపాటు ఫాంహౌస్‌లో ఉండి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వరుస ఎన్నికల్లో విజయాలతో కాంగ్రెస్ దూసుకెళ్తాందని, బీఆర్ఎస్కు పట్టుఉన్న జూబ్లీహిల్స్‌లోనూ గెలిచామని తెలిపారు.