NTR: ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని జాకీర్ హుస్సేన్ కళాశాల రోడ్లో కొండపై అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో, ఘటన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు ఏ విధంగా అంటుకున్నాయని విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.