GNTR: టీడీపీ పొన్నూరు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. పొన్నూరు పట్టణ, మండల పరిధిలోని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబధిత అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.