GDWL: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావడం అంటే గ్రామీణ కూలీల నోటి దగ్గర ముద్దను లాగేసుకోవడమే అని సీఐటీయూ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.