WGL: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ చేసిన వ్యాఖ్యలు సరికావని కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్ అన్నారు. ఇవాళ వరంగల్ శివనగర్‌లోని అయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించారు. సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు తగదన్నారు.