బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ స్పందించింది. ఈ దాడులు ఆందోళనకరమంటూ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్‌లో పారదర్శకంగా ఎన్నికలు జరగాలని భారత్ కోరుకుంటోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా హెచ్-1బీ వీసాల అంశాన్నీ ప్రస్తావించారు. దీనిపై అమెరికాతో చర్చించామని వెల్లడించారు.