ADB: అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంత చేసినా తక్కువే అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి చాలా చేయాల్సి ఉందన్నారు. రిమ్స్ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ.. వైద్య రంగానికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.