NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురాతమైన ఎమ్మార్వో కార్యాలయాన్ని పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న పాత ఎమ్మార్వో భవనం స్ధానంలో నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.