యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఎల్ఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం అయ్యారు. వీరారెడ్డి గత సంవత్సరం పైగా భువనగిరిలో రెవెన్యూ అదనపు కలెక్టర్గా పనిచేశారు. భూ సమస్యల పరిష్కారంలో ఆయనకు విశేష అనుభవం ఉంది.