BDK: ముక్కోటి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పరిసరాల్లో ప్రైవేట్ లాడ్జీలు రూమ్ రేట్లు భారీగా పెంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో గదికి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు వసూలు చేయడంతో పేద, మధ్యతరగతి రామభక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక రేట్ల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.