MHBD: కొత్తగూడ, గంగారం మండలాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఇవాళ మంత్రి సీతక్క శాలువతో సన్మానించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సర్పంచులు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె అన్నారు. జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, యూత్ నాయకుడు కుంజా సూర్య తదితరులు ఉన్నారు.