NZB: బాల్కొండలో 108ను ఉమ్మడి జిల్లాల మేనేజర్ జనార్ధన్, జిల్లా కోఆర్డినేటర్ స్వరాజ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అంబులెన్స్‌లో పరికరాల తీరును, మందులను పరిశీలించారు. సిబ్బందికి అన్ని వేళలా అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ శ్రీకాంత్, పైలెట్ గణేశ్ పాల్గొన్నారు.