కృష్ణా: తాడిగడపకు చెందిన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేసినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు. ఇన్స్టాలో పరిచయమైన మైఖేల్ విన్సెంట్ ఇమ్మిగ్రేషన్ నిపుణుడిగా పరిచయం చేసుకొని నకిలీ ఇంటర్వ్యూలు, Govt వెబ్సైట్ పేరుతో ఫేక్ E-Mails పంపాడు. నమ్మిన బాధితురాలు విడతల వారీగా రూ.32,08,000, అదనంగా రూ.7,500 పౌండ్లు అడగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.