NLR: మంత్రి ఆనం రామనారాయణరెడ్డిను ఇవాళ ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంఛార్జ్ మేయర్‌గా అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆనం రూప్ కుమార్‌కు శాలువా కప్పి బొకేతో అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలల్లో వేగం పెంచాలని సూచించారు.