TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ విచారణ ముగిసింది. రెండున్నర గంటల పాటు సిట్ అధికారులు ఆయనను విచారించారు. సాక్షిగా ఆరా మస్తాన్ స్టేట్ మెంట్ ను రెండో సారి అధికారులు తీసుకున్నారు. గతంలో చెప్పిన విషయాలను మళ్లీ అడిగారని మస్తాన్ తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు చెప్పిన అంశాలను క్రాస్ చెక్ చేసుకునేందుకు తనను విచారణకు పిలిచారని పేర్కొన్నారు.