MDK: రామాయంపేట మండల కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో గల ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ద్విచక్ర వాహనాలపై ఉన్న మోహన్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన 108 సిబ్బంది రమేష్, లింగులాల్ రక్షిత గాత్రులను రామాయంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.