GDWL: ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామంలో జరగనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావుని కలిశారు. ఆయనను శ్రీవారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించి, ఆహ్వాన పత్రికను అందజేశారు. వారి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు తెలిపారు.