CTR: పుంగనూరు మండలం మంగళం గ్రామ సమీపంలోని శ్రీ నల్లరాళ్లపల్లి గంగమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయ ఆవరణంలో దీపాలను వెలిగించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు.