AKP: అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా సస్పెక్టెడ్ రౌడీ షీటర్లకు శుక్రవారం పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో సీఐ అప్పన్న, ఎస్సై పురుషోత్తం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలలో పాల్గొనరాదని తెలిపారు. అలాగే సత్ప్రవర్తనతో ఉండాలన్నారు.