ADB: రాష్ట్ర రాజధానికి దూరంగా ఉన్న ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో రవాణా సౌకర్యాల మెరుగుకు ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అలాగే జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు, బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.