యూపీలోని యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో వార్తపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కనీసం 10 నిమిషాలు వార్తాపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.