NZB: వర్ని ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన వంశీ కృష్ణను శుక్రవారం మోస్రా మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మోస్రా మండలంలో శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు పిట్ల శ్రీ రాములు, హరినారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగ సాయ గౌడ్, బాగా రెడ్డి పాల్గొన్నారు.