NLG: తెలుగుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు తెలిపారు. శుక్రవారం దేవరకొండ మండలం తెలుగుపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, కంప చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు.