KDP: బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని అవధూతకాశినాయన మండలంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో గౌరవ వందనాన్ని స్వీకరించిన డీఎస్పీ, స్టేషన్ రికార్డులు, విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం మండలంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఎస్సైతో సమీక్షించి, ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేలా విధులు నిర్వహించాలన్నారు.