కృష్ణా: నిమ్మకూరు గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన పుట్టినిల్లు నిమ్మకూరుకు కావడం ఎంతో గర్వకారణమని, ఈ గ్రామం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఏపీపీటీడీ కార్మిక పరిషత్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఆళ్లగడ్డ రమేష్ భువనేశ్వరికి నూతన వస్త్రాలను అందజేశారు.