TG: ఎస్సీ వర్గాలకు చెందిన వారు క్రైస్తవ మతంలోకి మారినా ఎస్సీ చట్టం వర్తించాలనే తన అభిప్రాయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. ఎస్సీల హక్కులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. త్వరలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.