KMR: పంచముఖి హనుమాన్ కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? లేదా ఆత్మహత్యనా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు.