VZM: కొత్తవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన శనివారం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎస్.రమణయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశం ఆరోజు ఉదయం 10.30 గం.లకు సమావేశ మందిరంలో జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.