అన్నమయ్య: రైల్వే కోడూరులోని TDP ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం కోడూరులోని రాఘవ రాజాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బారులో సమర్పించిన అర్జీలకు సత్వర పరిష్కారం లభిస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.