TG: హీరో నాగార్జునకు కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో మాజీ మంత్రులు హరీష్ రావు, KTRలకు అవకాశం కల్పించాలని నాగార్జునను కోరారు. వీళ్లు మంచి నటులుగా పేరు ప్రఖ్యాతి సంపాదించారని పేర్కొన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డులు బద్దలు కొట్టారని వ్యంగ్యంగా విమర్శించారు.