యాషెస్ నాలుగో టెస్టులో తొలిరోజే 20 వికెట్లు పడ్డాయి. మెల్బోర్న్ పిచ్ చూస్తుంటే ఈ మ్యాచ్ మూడు రోజులు కూడా సాగడం అనుమానంగా మారింది. అయితే, ఇదే పరిస్థితి భారత్‌లో జరిగే టెస్టుల్లో ఎదురై, తొలిరోజే 20 వికెట్లు పడితే.. అది ‘చెత్త పిచ్’ అని, ఇలాంటి పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహిస్తే టెస్టు క్రికెట్ చచ్చిపోతుందని విదేశీ మీడియా గగ్గోలు పెట్టేది.