SKLM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ చేతికి మీ భూమి’ (22 ఏ) కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు, భూ యజమానుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీ చేతికి మీ భూమి కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.