MDK: నార్సింగి మండలం జప్తి శివునూర్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబందు సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ రాములు పాల్గొన్నారు.