SKLM: రథసప్తమి ఉత్సవాలపై ఈనెల 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలోని జడ్పీ మందిరంలో నిర్వహించబడునని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ఆలయ సంప్రదాయాలను అవగాహన కలిగిన పెద్దలు హాజరుకావాలన్నారు.