ADB: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని శుక్రవారం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిశారు. అనంతరం మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలు, అబివృద్ధి పనులపై చర్చించారు. ఇందులో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.