కృష్ణా: వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడ బేతవోలు లోని రంగా విగ్రహానికి కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి వారు హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేశారని కొనియాడారు. అనంతరం కూటమి నేతలు రంగాను స్మరించుకున్నారు.