TG: కల్వకుంట్ల కవిత రేపు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పర్యటించనున్నారు. 10AMకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపు హౌస్, 10:30AMకు పాలమూరు-రంగారెడ్డి పంపు హౌస్ పరిశీలిస్తారు. 11AMకు పెంట్లవెల్లి మండల కేంద్రంలో రుణమాఫీ కానీ రైతులతో ఆమె సమావేశమవుతారు. 11:30AMకు పెద్ద కొత్తపల్లి, కొల్లాపూర్ మండలాల ఎరుకల సంఘం సభ్యులతో, 12PMకు ముదిరాజ్ సంఘం సభ్యులతో సమావేశం కానున్నారు.