MNCL: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని లక్షెట్టిపేట కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. ఎన్నికల హామీ మేరకు మోదెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం పట్టణంలో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.