కృష్ణా: అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఇవాళ వస్త్రదానం చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి ఆసుపత్రి పారిశుధ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి నూతన వస్త్రాలు అందచేశారు. రంగా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.